న్యూఢిల్లీ: భారత్ లో ఐటీ కన్సల్టింగ్ రంగంలో ఉన్న ఒకటైన యూఎస్ కు చెందిన కాగ్నిజెంట్ ఐటీ కంపెనీ ఈ సంవత్సరం భారత దేశంలో 23,000 పైచిలుకు ఫ్రెషర్లను నియమించబోతోంది. 2020 ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 35 శాతం పైగా ఎక్కువ అని ఆ సంస్థ సీఎండీ రాజేశ్ నంబియార్ తెలిపారు.
గత 2020 సంవత్సరంలో కంపెనీ 17,000 మందికి పైగా కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకున్నట్టు తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అత్యంత ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్మెంట్ విద్యార్థులతోపాటు ఇతర నిపుణుల నియామకాలను దేశంలో పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని నంబియార్ చెప్పారు.
పోయిన ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా 17 వేల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను తమ సంస్థలో చేర్చుకున్నట్టు తెలిపారు. నిపుణులను దక్కించుకోవడంలో కీలక కేంద్రాల్లో భారత్ ఒకటిగా ఉంటుందని ఆయన అన్నారు. కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది జనవరి–మార్చిలో పెద్ద ఎత్తున నియామకాలు ఉంటాయని వివరించారు. కాగ్నిజెంట్‌కు ఇప్పటికే భారత్‌లో సంస్థకు 2.04 లక్షల ఉద్యోగులు ఉన్నారు.