బిగ్ బ్రేకింగ్ న్యూస్: బయపడినట్లే భారత్ లో తొలి ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్ లో 2 ఒమిక్రాన్ కేసులు నమోదవడం సంచలనాన్ని రేపుతోంది.
తొలి ఒమిక్రాన్ కేసులు 2 ఇవాళ బెంగళూరు లో నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
అయితే ఈ ఇద్దరిలో పెద్దగా లక్షణాలు ఏమి లేవని కెండ్రం తెలిపింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఎవైకీ తీవ్ర లక్షణాలు లేవని తెలిపింది. దేశవ్యాప్తంగా 37 లాబొరేటరీలు నెలకొల్పామని తెలిపింది.
అలాగే విదేశల నుండి వచ్చే అందరికీ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి అని, పాజిటివ్ వస్తే ప్రోటోకాల్స్ పాటించాల్సిందేనని తెలిపింది.