ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా మన సినిమాలు బ్లాక్‌బస్టర్ వసూళ్లు సాధిస్తున్నాయి.
ఈ ఏడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఓవర్సీస్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 18 రోజుల్లోనే ఈ చిత్రం $29.21 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించి, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 భారతీయ సినిమాల జాబితాలో చేరింది.
ఈ జాబితాలో మొదటి స్థానంలో షారుఖ్ ఖాన్ పఠాన్ $49.33 మిలియన్ డాలర్స్‌తో ఉండగా, జవాన్ $48 మిలియన్ డాలర్స్‌తో రెండో స్థానంలో నిలిచింది.
మూడో స్థానంలో బాహుబలి 2 $46.98 మిలియన్ డాలర్స్ వసూళ్లతో నిలిచింది. అల్లు అర్జున్ పుష్ప 2 మాత్రం వంద కోట్ల క్లబ్‌లో ప్రవేశించి తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇకపోతే, పుష్ప 2 టాప్ 10లో ఉండటం తెలుగు సినిమాల ఖ్యాతిని మరింత పెంచుతోంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులు సాధిస్తుందని అంచనా. ప్రస్తుతం అభిమానులు పుష్ప 2 విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.