తిరుమల : కరోనా మొదలయ్యాక మూత పడ్డ శ్రీ వేంకటేశ్వర ఆలయం చాల నెలల తరువాత మూడు నెలల క్రితం మొదలయింది. అప్పటి నుండి టీటీడీ కరోనా కేసులను బట్టి కొద్ది కొద్దిగా సడలింపులు ఇచ్చుకుంటూ వస్తోండి. రేపు అనగా డిసెంబర్ 25న వైకుంట ఏకాదశి సందర్భంగా దర్శనానికి కూడా ఆన్ లైన్ లో టికెట్లు వదిలింది. అవి వదిలిన ఒక రోజులోనే టికెట్లు అన్నీ బుక్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో శ్రీ వారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సకల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రేపటి నుండి వరుసగా 10 రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరుస్తున్నామని, రోజుకు 30 వేల మందికి దర్శనాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేపు ఉదయం 4 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. ముందుగా వీఐపీ ప్రొటోకాల్, శ్రీవారి ట్రస్ట్ భక్తులకు అనుమతి ఉంటుందని, ఉదయం 7:30 నుంచి సామాన్య భక్తులకు దర్శనాలు కల్పిస్తామని చెప్పారు. భక్తులంతా కోవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.