అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా మరో 3 లక్షల 98 మందికి సామాజిక పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గత సంవత్సరం డిసెంబర్‌లోనూ ప్రభుత్వం కొత్తగా 1.50 లక్షల మందికి పింఛన్లను మంజూరు చేసింది.
నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకి జూలై 19వ తేదీన పింఛను మంజూరు పత్రంతోపాటు పింఛన్ కార్డు, పాస్‌బుక్‌లను అందజేయనున్నట్టు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు.
వచ్చే నెల జూలై 19న ప్రత్యేకంగా ఆయా పథకాల లబ్ధిని అర్హులకు అందజేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 24న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి కూడా అదే రోజున మంజూరు పత్రాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.