న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం డిజిటల్ వార్ కొనసాగిస్తోంది. ఇప్పటికే జూన్ లో చైనాకు సంబంధించిన 59 యాప్లను నిషేధించిన భారత తాజాగా చైనాకు సంబంధించిన మరొ 47 యాప్ లను నిషేధించింది.
భారత దేశ పౌరులకు, వారి భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందన్న అనుమానాలు ఉన్న యాప్ లను నిషేధించాలని భారత నిఘా వర్గాల సిఫారసు మేరకు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే నిషేధించిన 59 యాప్ లకు క్లోన్డ్ యాప్ లుగా కొనసాగుతున్న కొన్ని యాప్లను గుర్తించిన ప్రభుత్వం తాజాగా వాటిని కూడా నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. వీటిలో టిక్ టాక్ లైట్, షేర్ ఇట్ లైట్, పబ్ జీ గేం, హెలో లైట్ లాంటి యాప్స్ ఉన్నట్టు సమాచారం.
గాల్వన్ లోయ ఘటన జరిగిన తరువాత భారత దేశం చైనా యాప్ లను నిషేధించడం మొదలు పెట్టింది. అప్పటి నుండి స్వదేశీ వస్తువుల తయారీపై కూడా భారత ప్రభుత్వం దృష్టి సారించాల్సిందిగా దేశ పారిశ్రామిక కంపెనీలను కోరుతోంది.
ఈ యాప్ లను భారత దేశంకు సంబంధించిన గూగుల్ ప్లే, ఆపిల్ స్టోర్స్ నుండి జాబితాలో నుంచి తొలగించాల్సిందిగా ఆ కంపెనీలను కోరినట్లు సమాచారం. పబ్ జీ భారత దేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన ఆట, మరి భారతీయులు ఈ పబ్ జీని ఎంత త్వరగా మరచిపోతారో చూడాలి.