కోలీవుడ్: కోలీవుడ్ హీరో సూర్య తన భార్య జ్యోతిక కలిసి 2D ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. పోయిన సంవత్సరం వీళ్ళ బ్యానర్ లో రూపొందిన ‘ఆకాశం నీ హద్దురా’ అద్భుతమైన విజయం సాధించింది. ఇదే ఉత్సాహం తో తమ బ్యానర్ పై వరుసగా సినిమాలని రూపొందిస్తున్నారు. కానీ చిన్న సినిమాలని, మనసుకి హత్తుకునే కథలతో రూపొందించి, తక్కువ స్టార్ కాస్ట్ తో రూపొందించి ఆ సినిమాలని ఓటీటీ లో విడుదల చేయనున్నారు. ఇవాళ సూర్య తన బ్యానర్ నుండి వస్తున్న నాలుగు సినిమాలని ఓటీటీ లో విడుదల అవనున్నట్టు ప్రకటించాడు.
సూర్య హీరో గా నటిస్తూ ట్రిబుల్స్ హక్కుల కోసం పోరాడే లాయర్ పాత్రలో నటిస్తున్న ‘జై భీం‘ సినిమాని నవంబర్ లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాని జ్ఞానవేల్ అనే దర్శకుడు రూపొందించాడు. జ్యోతిక ప్రధాన పాత్రలో అనంతపురం లాంటి సినిమా ద్వారా తెలుగువారికి పరిచయం అయిన శశికుమార్ మరో పాత్రలో ఇద్దరు అక్క తమ్ముళ్ల మధ్య రిలేషన్ షిప్ ఆధారంగా రూపొందిన ‘ఉదాన్ పిరప్పే’ అనే సినిమాని అక్టోబర్ లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నారు.
ఒక చిన్న పిల్ల వాడు మరియు అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన కుక్కకి ఉండే ఫ్రెండ్షిప్ ఎమోషన్ ని బేస్ చేసుకుని రూపొందిన ‘ఓ మై డాగ్’ అనే సినిమాని డిసెంబర్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో అరుణ్ విజయ్ నటిస్తున్నాడు. ‘రామ్ ఆండాళుమ్- రావనే ఆండాళుమ్’ అంటూ సాగే విలేజ్ ఎమోషనల్ బాండింగ్ బేస్డ్ మూవీ ఒకటి సెప్టెంబర్ లో విడుదల చేయనున్నారు. ఈ నాలుగు సినిమాలని సెప్టెంబర్ నుండి వచ్చే నాలుగునెలల్లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు.