fbpx
Saturday, January 18, 2025
HomeBig Storyదేశంలో నాలుగు వ్యాక్సిన్లు సిద్ధం: కేంద్రం

దేశంలో నాలుగు వ్యాక్సిన్లు సిద్ధం: కేంద్రం

4VACCINES-READY-IN-INDIA-SAYS-CENTER

న్యూఢిల్లీ: దేశంలో కొత్త కరోనా వ్యాక్సిన్ల పై కేంద్రం ఇవాళ కీలక ప్రకటన చేసింది. దేశంలో మరో నాలుగు కోవిడ్ వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఆ వ్యాక్సిన్లతో పాటు మరొక వ్యాక్సిన్‌ కూడా ప్రీ క్లినికల్‌ దశలో ఉందని తెలిపింది. ఈ రోజు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా విజ్ఞాన మరియు సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

కోవిడ్ -19 వ్యాక్సిన్లపై పరిశోధన మరియు వాటీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడవ ఉద్దీపన ప్యాకేజీ ఆత్మనిర్భర్ భారత్ 3.0 లో భాగంగా మిషన్ కోవిడ్ సురక్ష – ఇండియన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ డెవలప్మెంట్ మిషన్ ను ప్రకటించినట్లు సింగ్ తెలిపారు.

కాడిల్లా హెల్త్‌కేర్ లిమిటెడ్‌ కంపెనీ వారి డీఎన్‌ఎ ఆధారిత టీకా మూడవ దశ క్లినికల్ పరీక్షల దశ జరుగుతున్నాయని, అలాగే ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ ఆమోదం కోసం మధ్యంతర డేటాను కూడా సమర్పించిందని తెలిపింది. బయోలాజికల్ ఈ లిమిటెడ్ టీకా కూడా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నట్టు చెప్పారు. అలాగే ముక్కులో వేసే భారత్ బయోటెక్ టీకా కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉందని తెలిపారు.

అలాగే జెన్నోవా వారి బయో ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌కు చెందిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకా యొక్క ట్రయల్స్‌ కూడా మొదటి దశలో ఉన్నాయని తెలిపారు. గుర్గావ్‌కు చెందిన జెనిక్ లైఫ్ సైన్సెస్ టీకా అడ్వాన్స్‌డ్‌ ప్రీ-క్లినికల్ దశలో ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం సీరం ఇన్స్టిట్యూత్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్‌, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాక్సిన్ , రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లు భారత దేశంలో పంపిణీ చేయబడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular