న్యూఢిల్లీ: దేశంలో మరో సారి వంట గ్యాస్ ధర పెరిగింది. గృహ వినియాఒగ 14.2 కేజీల సిలిండర్‌పై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మళ్ళీ రూ. 50 పెంచాయి. ఈ పెంపు అనంతరం ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 769కి చేరింది.
ఈ పెంపు నేటి(సోమవారం) నుంచి అమల్లోకి రానుంది. అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా నెలవారీగా చమురు సంస్థలు ఈ ధరను సమీక్షిస్తాయి. గృహావసర ఎల్పీజీ సిలిండర్లపై ప్రస్తుతం ప్రభుత్వం సబ్సీడీ ఇస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది.
మరో వైపు దేశంలో ఆరో రోజూ కూడా వరుసగా పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆదివారం లీటరు పెట్రోల్ ధర 29 పైసలు, డీజిల్ ధర 32 పైసలు పెరిగాయి. దీంతో రాజస్తాన్‌లోని గంగానగర్ టౌన్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 99.29కి చేరగా డీజిల్ ధర రూ. 91.17కి చేరింది.
దేశం మొత్తం మీద రాజస్తాన్‌లోనే ఆయిల్ రేట్లపై అత్యధిక పన్నులు వడ్డిస్తున్న కారణంగా అక్కడ ఈ రేట్లు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర జీవిత కాల గరిష్టానికి రూ. 88.73కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 79.06కు చేరకుంది.