కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఇవాళ దారుణం చోటుచేసుకుంది. ఆ ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి అనుమతి లేకుండానే కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కాగా చికిత్స పొందుతున్న కరోనా రోగుల్లో వారిలో ఐదుగురు ఆక్సిజన్ అందక చనిపోయారు.
ఆసుపత్రిలో జరిగిన ఆ సంఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన పై స్పందించిన కలెక్టర్ ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ జరుపుతున్నట్లు కర్నూలు కలెక్టర్ తెలిపారు. కర్నూలులోని కేఎస్ కేర్ ఆస్పత్రిలో కరోనా చికిత్సకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు.
ఈ చికిత్సలో భాగంగా ఆక్సిజన్ అందక ఐదుగురు కరోన బాధితులు మృతి చెందారు. అనుమతి లేకుండా కోవిడ్ చికిత్స చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. కేఎస్ కేర్ ఆస్పత్రిలో కోవిడ్ వైద్యానికి అనుమతి లేదు కలెక్టర్ స్పష్టం చేశారు. ఘటనపై డీఎంహెచ్‌ఓ విచారణ చేస్తున్నారు. కోవిడ్ ఆస్పత్రిగా నోటిఫైడ్ చేయని కేఎస్కేర్ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా బాధితులు ఆక్సిజన్ అందక చనిపోయారని తెలుసుకుని డీఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య విచారణ మొదలు పెట్టారు.