న్యూఢిల్లీ: మొబైల్ చందాదార్ల విషయంలో నూతన మొబైల్ 5జీ టెక్నాలజీ చరిత్ర సృష్టించబోతోంది. ప్రస్తుతం భారత దేశం లో 5జీ నెట్వర్క్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2027 నాటికి 50 కోట్లకు చేరుకోనున్నట్లు అంచనా. కాగా మొత్తం మొబైల్ చందాదార్లలో ఇది 39 శాతం వాటా అని టెలికం గేర్ మేకర్ ఎరిక్సన్ వెల్లడించింది. భారత్ లో మొత్తం స్మార్ట్‌ఫోన్ వినియోగదార్ల సంఖ్య ఈ ఏడాది డిసెంబర్‌కల్లా 81 కోట్లుగా ఉండనుంది. ఈ సంఖ్య రాబోయే ఆరు సంవత్సరాల్లో ఇది 120 కోట్లకు ఎగుస్తుందని అంచనా.
ఇదే నేపథ్యంలో 4జీ మొబైల్ యూజర్ల సంఖ్య 79 కోట్ల నుంచి 71 కోట్లకు వచ్చి చేరనుంది. 4జీ చందాదార్ల వాటా ప్రస్తుతం ఉన్న 68 శాతం నుండి 55 శాతానికి జారిపోనుంది. 5జీ యూజర్ల సంఖ్య అంతర్జాతీయంగా మొత్తం చందాదార్లలో సుమారు 50 శాతం వరకు పెరుగుతుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదార్లలో 62 శాతం వాటా వీరిదే అవనుంది.
ఇప్పటికే దిగ్గజ దేశాలైన చైనా, ఉత్తర అమెరికా నుండి అంచనాలను మించి డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి ప్రధాన కారణం. 2011 నుంచి మొబైల్ డేటా ట్రాఫిక్ ఇప్పటి వరకు 300 రెట్ల వరకు పెరిగింది. 2021 చివరినాటికి 200 కోట్లకుపైగా ప్రజలకు 5జీ నెట్‌వర్క్ చేరువ అవుతుంది. మొత్తం మొబైల్ నెట్‌వర్క్ డేటా ట్రాఫిక్ 2027 చివరికి 370 ఎక్సాబైట్స్ నమోదు కానుంది’ అని ఎరిక్సన్ తన ప్రకటనలో తెలిపింది.