fbpx
Friday, December 13, 2024
HomeInternationalరవిశాస్త్రి, ఇతరులకు కరోనా వల్ల 5వ టెస్టు రద్దు!

రవిశాస్త్రి, ఇతరులకు కరోనా వల్ల 5వ టెస్టు రద్దు!

5TH-TEST-CALLED-OFF-AMID-COVID-CASES

లండన్: భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి కి మరియు జట్టులోని ఇతరులకు కరోనా సోకడం వల్ల భారత్-ఇంగ్లండ్ మధ్యన జరగాల్సిన 5వ టెస్టు రద్దయింది. దీనితో 5 మ్యాచ్ ల ఈ సిరీస్ లో భారత్ 2-1 తో ఆధిక్యంలో ఉంది. కాగా ఈ ఆధిక్యం వల్ల భార సిరీస్ గెలిచినా ఈసీబీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.

కాగా ఈ చివరి మ్యాచ్ ను ఇంగ్లండ్ భారత్ కు పర్యటించే సమయంలో తిరిగి జరిపేల రెండు బోర్డుల మధ్య ఒక ఒప్పందం జరిగినట్లు సమాచారం. కాగా ఈసీబీ మాత్రం ఈ మ్యాచ్ ఆ సిరీస్ లో భాగం కాదు అది ఒక ప్రత్యేక మ్యాచ్ గా మాత్రమే పరిగణిస్తామని అంటోంది.

వచ్చే ఏడాది భారత్ లో పర్యటించనున్న ఇంగ్లండ్ పరిమిత్వ ఓవర్ల మ్యాచ్ సిరీస్ లో ఆడనుంది. అయితే రద్దైన ఈ టెస్ట్ మ్యాచ్ ను ఆ సిరీస్ సందర్భంగా జరపాలని ఇప్పటికే ఒక సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఐపీఎల్ కోసం భారత్ ఈ మ్యాచ్ ను రద్దు చేసిందని కొందరు ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్ళు బీసీసీఐ ని నిందిస్తుండడం గమనార్హం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular