fbpx
Sunday, January 19, 2025
HomeAndhra Pradeshఏపీలో 60.7% మందికి కరోనా వచ్చి పోయిందట

ఏపీలో 60.7% మందికి కరోనా వచ్చి పోయిందట

60.7%-PEOPLE-GOT-COVID-AS-PER-SERO-SURVEY

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 60 శాతం మందికిపైగా కరోనా వైరస్ వచ్చి పోయిందని, కాగా అధికారికంగా జరిగిన కరోనా పరీక్షలు ద్వారా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది 15 లక్షల మంది మాత్రమే అయినప్పటికీ ‘సీరో’ సర్వేలో మాత్రం 60.7 శాతం మంది కరోనా సోకి వారందరూ కోలుకున్నట్లు తేలింది.

మహిళలు, పురుషులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలు ఇలా రకరకాలుగా నమూనాలు సేకరించి వారిపై ఈ సీరో సర్వే నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 9 నుంచి 15వ తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను నిర్వహించింది. పట్టణాల్లో 63.5 శాతం మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 56.8 శాతం మందికి కరోనా వచ్చి పోయినట్టు ఈ సర్వేలో తేల్చారు. వీరంతా టీకాలు తీసుకోని వారే.

కాగా మరో వైపు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిని మూడు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్ లో హెల్త్‌కేర్‌ వర్కర్లు, రెండవ గ్రూప్‌ లో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, మూడవ గ్రూప్‌ లో ఇతర విభాగాల సిబ్బంది నుంచి ఈ సర్వేలో నమూనాలు సేకరించారు. వీరంతా రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న వారే. వీరి నుంచి 6,284 శాంపిళ్లు సేకరించి పరీక్షించారు. మొత్తమ్మీద టీకాలు తీసుకున్న 79 శాతం మందిలో యాంటీబాడీస్‌ కనిపించాయి.

కాగా ఈ సీరో సర్వే లెన్స్‌లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో పాజిటివిటీ రేటు కనిపించింది. ఈ జిల్లా మహిళల్లో అత్యధికంగా కరోనా వైరస్ వచ్చి పోయినట్టు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 72.7 శాతం మంది మహిళలకు కరోనా వచ్చిపోయిందని తెలిపింది. పట్టణాల్లోనూ 79.1 శాతం మంది మహిళల్లో పాజిటివిటీ రేటు నమోదైంది. ఇక రెండు డోసులు వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో కూడా ఎక్కువగా కృష్ణా జిల్లాలోనే యాంటీబాడీస్‌ వృద్ధి చెందిన వారున్నారు.

అయితే విశాఖ జిల్లాలో పట్టణాల్లో పురుషులు 35.4% మంది కరోనా వైరస్ సోకి కోలుకున్నారు. గ్రామీణ ప్రాంత పురుషుల్లో 29.1 శాతం మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. మహిళల్లో పల్లెల్లో 33.2 శాతం, పట్టణాల్లో 46.8 శాతం మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. రెండు డోసులు వేసుకున్న వారిలో అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో గ్రూప్‌–1 వారికి పట్టణాల్లో 63.6 శాతం, గ్రామాల్లో 54.1 శాతం, గ్రూప్‌ –2 వారికి పట్టణాల్లో 64 శాతం, గ్రామాల్లో 49 శాతం మందిలో యాంటీబాడీస్‌ వృద్ధి కనిపించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular