fbpx
Sunday, January 19, 2025
HomeAndhra Pradesh6,096 కరోనా కేసులు నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్

6,096 కరోనా కేసులు నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్

6096-CASES-IN-ANDHRAPRADESH-TODAY

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 35,962 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. కాగా అందులోంచి 6,096 మందికి కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా సోకిన 20 మంది ఈ 24 గంటల్లో మరణించారు.

అయితే, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారి నుండి కోలుకుని 2,194 మంది క్షేమంగా ఇంటికి వెళ్ళారు. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా, 9 లక్షల 5వేల 266 మంది కరోనా నుండి కోరుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 35,592 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,56,06,163 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం కరోనా పై హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular