అమరావతి: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కాగా ఏపీ లో కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో గత 24 గంటలలో 38,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 618 మందికి పాజిటివ్‌గా తేలింది.
అలాగే రాష్ట్రంలో గత 24 గంటలలో కరోనా బారిన పడి ఆరు మంది మరణించారు. ఈ మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 14,142 కు చేరింది. 1,178 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని క్షేమంగా ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. దీనితో ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు.
ఈ రోజు ఏపీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనా వైరస్ కేసులపై హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతానికి 12,482 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. వీటితో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,47,459 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,81,32,713 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.