న్యూ ఢిల్లీ: దేశం లోని అన్ని భాషల్లో సినిమాలు నిర్మించే ఇండస్ట్రీలు, విడుదలయ్యే సినిమా టీమ్స్ ఎంతో ప్రతిష్టగా ఫీలయ్యే అవార్డ్స్ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఫిలిమ్స్. నిన్న కేంద్ర ప్రభుత్వం 2019 వ సంవత్సరంలో విడుదలైన సినిమాలకి జాతీయ అవార్డులని ప్రకటించింది. ఈ అవార్డులని 67 వ జాతీయ అవార్డ్స్ గా ప్రకటించింది ప్రభుత్వం. ఇక అవార్డు విన్నర్స్ లిస్ట్ చూద్దాం.
ఈ సారి ఉత్తమ నటుడి క్యాటగిరి అవార్డుని ఇద్దరు నటులు షేర్ చేసుకున్నారు. హిందీ లో విడుదలైన ‘భోంస్లే’ అనే సినిమాలో అద్భుత నటనకి మనోజ్ బాజ్ పాయ్ కి మరియు తమిళ్ లో రూపొందిన అసురణ్ సినిమాలో ధనూష్ నటనకి ఉత్తమ నటుడి క్యాటగిరి లో అవార్డు పొందారు. ధనుష్ కి ఇది జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెలవడం రెండవ సారి. మొదటి సారి ఆడుకులం అనే తమిళ సినిమా ద్వారా ఈ అవార్డు పొందాడు. ‘మణి కర్ణిక’, ‘పంగా’ సినిమాలో కనబర్చిన నటనకి కంగనా రనౌత్ కి ఉత్తమ నటి గా జాతీయ అవార్డు లభించింది.
హిందీ లో సుశాంత్ నటించిన ‘చిచోరే’ సినిమాకి ఉత్తమ హిందీ సినిమాగా జాతీయ అవార్డు లభించింది. మలయాళం లో రూపొందిన మారక్కర్ సినిమాకి ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డు లభించింది. అలాగే ప్రతి మనిషికి విలువ ఇవ్వాలని డార్క్ కెన్సెప్టు తో రూపొందిన బహత్తార్ హూరైన్ అనే సినిమాని డైరెక్ట్ చేసిన సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ కి ఉత్తమ డైరెక్టర్ గా, సూపర్ డీలక్స్ సినిమాలో అద్భుత నటన కనబర్చిన విజయ్ సేతుపతి కి ఉత్తమ సహాయ నటుడి గా, తాశ్కెంట్ ఫైల్స్ అనే హిందీ సినిమాలో నటించిన పల్లవి జోషి కి ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డ్స్ లభించాయి.
ఇవే కాకుండా తెలుగులో జెర్సీ, మహర్షి సినిమాలకి కొన్ని క్యాటగిరిలో అవార్డులు లభించాయి. తమిళ్ లో అసురణ్ సినిమా కి ఉత్తమ తమిళ చిత్రంగా, విశ్వాసం సినిమాకి సంగీతం అందించిన ఇమాన్ కి ఉత్తమ సంగీత దర్శకుడు క్యాటగిరి లో , మలయాళం లో రూపొందిన మారక్కర్ సినిమాకి ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ క్యాటగిరిలో అవార్డ్స్ లభించాయి. కన్నడ లో రూపొందిన అవన్ శ్రీమన్నారాయణ సినిమాకి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ క్యాటగిరి లో జాతీయ అవార్డు లభించింది. మొత్తంగా చూసుకుంటే సౌత్ లో మలయాళం సినిమా ఇండస్ట్రీ ఎక్కువ జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది.