హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పదవ తరగరి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ 2021-22 విద్యా సంవత్సరం లో పదవ తరగతి పరీక్షల పేపర్ల సంఖ్యను కుదించింది.
ఈ నిర్ణయంతో ఇక నుండి ఈ ఏడాది పదవ తరగ్తి పరీక్షల్లో 11 పేపర్లకు బదులు ఆ సంఖ్యను ఆరు పేపర్లతో మాత్రమే పరీక్షలు నిర్వహించబోతున్నట్లు, అలాగే ప్రతి ఒక్క సబ్జెక్టుకు కేవలం ఒక్క పేపర్‌గానే పరీక్ష పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే గత విద్యా సంవత్సరం 2020-21లో 6 పేపర్లతోనే పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని భావించిన ప్రభుత్వం 2021-22లో కూడా ఇదే విధంగానే అమలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించడం గమనార్హం.