న్యూఢిల్లీ: నేపాల్ సరిహద్దుల వద్ద, టిబెట్‌లో భారీ భూకంపం (Earth Quake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో ఈ భూకంపం జరిగినట్లు చైనా మీడియా షిన్హువా, వార్తా సంస్థ ఏఎఫ్పీ ద్వారా తెలిపింది.
ఈ విపత్తులో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపం ప్రభావం భారత్‌లోని బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో కూడా తీవ్రంగా కనిపించింది.
నేపాల్ భూగర్భ శాస్త్ర పరంగా చాలా చురుకైన ప్రాంతంలో ఉంది.
ఇక్కడ భారత ఉపఖండం మరియు యూరేషియన్ టెక్టానిక్ ఫ్లేట్లు ఢీకొనడం వల్ల హిమాలయాలు ఏర్పడటమే కాకుండా, భూకంపాలు తరచూ జరుగుతుంటాయి.
2015లో 7.8 తీవ్రతతో జరిగిన భూకంపంలో 9,000 మంది ప్రాణాలు కోల్పోగా, 22,000 మందికి పైగా గాయపడ్డారు.
అప్పుడు లక్షలాది ఇళ్లను ఈ విపత్తు నాశనం చేసింది.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) సమాచారం ప్రకారం, ఈ రోజు ఉదయం 6:35 గంటలకు భూకంపం నమోదు అయ్యింది.
తొలి భూకంపం తర్వాత మరో రెండు భూకంపాలు కూడా సంభవించినట్లు ఎన్‌సీఎస్ వెల్లడించింది.
4.7 తీవ్రతతో రెండో భూకంపం ఉదయం 7:02 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో, 4.9 తీవ్రతతో మూడో భూకంపం 7:07 గంటలకు 30 కిలోమీటర్ల లోతులో నమోదయ్యాయి.
బీహార్‌లో ఈ భూకంపం ప్రభావం గణనీయంగా కనిపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అయితే, ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు ఇంకా లేవని అధికారులు తెలిపారు.