మూవీడెస్క్: లవ్ స్టోరీలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన 7/G బృందావన్ కాలనీ 2000లలో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
రవి కృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదలై సెన్సేషనల్ హిట్ అందుకుంది.
సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 90స్ పిల్లలకి ఎప్పటికీ ఫేవరేట్ గా నిలిచింది.
అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకున్న ఈ మూవీకి సీక్వెల్ ఉండబోతోందని మేకర్స్ ప్రకటించి ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచారు.
అయితే, ఆ ప్రకటన తర్వాత ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో సినిమా గురించి రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
కానీ షూటింగ్ పనులను పూర్తి నిశ్శబ్దంగా కొనసాగించిన మేకర్స్.. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు.
ఫస్ట్ లుక్ లో మధ్యలో రోడ్డు, చుట్టూ భవనాల మధ్య బ్యాగులు పట్టుకుని నడుస్తున్న జంట కనిపిస్తోంది.
అయితే వారి ముఖాలను రివీల్ చేయకపోవడంతో హీరో, హీరోయిన్ ఎవరన్నదే సస్పెన్స్ గా మిగిలింది.
రవికృష్ణ, సోనియా అగర్వాల్ మళ్లీ నటిస్తున్నారా? లేక కొత్తవారు వస్తున్నారా? అన్నదే ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ సీక్వెల్ ను కూడా సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, రామ్ జీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉండటంతో త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వస్తాయని మేకర్స్ వెల్లడించారు.
7/G సీక్వెల్ ఎప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందో వేచి చూడాలి.