అమరావతి: దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. అదే విధంగా ఏపీలో కూడా గత 24 గంటల్లో 1,01,863 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 8,239 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 17,93,227 మందికి కరోనా వైరస్ సోకింది. కేవలం నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 61 మంది మరణించారు. ఈ మరణాలతొ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 11,824కు చేరింది.
ఇక గ 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 11,135 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, మొత్త ఇంతవరకు 16 లక్షల 88 వేల 198 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 96,100 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,02,39,490 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఈ విధంగా ఉన్నాయి: శ్రీకాకుళంలో 421, విజయనగరంలో 254, విశాఖలో 500, తూర్పుగోదావరిలో 1271, పశ్చిమగోదావరిలో 887, కృష్ణాలో 462, గుంటూరులో 488, ప్రకాశంలో 561, నెల్లూరులో 407, చిత్తూరులో 1396 , అనంతపురంలో 698, కర్నూలులో 201, వైఎస్ఆర్ జిల్లాలో 693 కేసులు నమోదయ్యాయి.