న్యూఢిల్లీ: ఢిల్లీలో 90 శాతానికి పైగా ప్రజలకు కరోనా వైరస్ ను ఎదిరించే యాంటీ బాడీలను కలిగి ఉన్నారని దేశ రాజధానిలో జరిగిన ఆరవ సెరో-సర్వే నివేదిక ప్రకారం ఈ విషయాలు తెలుస్తున్నాయి.
దేశ రాజధాని లోని ప్రతి జిల్లాలో 85 శాతానికి తక్కువ కాకుండా సెరో-పాజిటివిటీని నమోదు చేసింది. అయితే, ఈ సంఖ్య కోవిడ్ వ్యాక్సిన్ ద్వారా ఏర్పడిన ప్రతిరోధకాలను కలిగి ఉంటుంది.
గత ఆదివారం వరకు ఢిల్లీలో రెండు కోట్ల మందికి పైగా దాదాపు 86 శాతం జనాభా మొదటి డోస్ వ్యాక్సిన్‌ని అందుకున్నారు. ఇక దాదాపు 48 శాతం మంది రెండవ డోసులను పొందారు.