అమరావతి: తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటలలో 31,325 భారి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో కొత్తగా 997 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ జరిగింది. కాగా ఈ రోజు కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు 8,99,812 మందికి కరోనా వైరస్ సోకినట్లయింది.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఈ రోజు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 282 మంది క్షేమంగా ఇంటికి డిశ్చార్జ్ అవ్వగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 8,86,498 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇదిలా ఉండగా కరోనా వల్ల గత 24 గంటల్లో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు మృతిచెందగా, ఇప్పటివరకు 7,210 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 6,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 1,50,21,364 నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.