fbpx
Monday, May 12, 2025
HomeMovie Newsఏ.ఆర్.రహమాన్ అందించిన కథ తో వస్తున్న '99 సాంగ్స్'

ఏ.ఆర్.రహమాన్ అందించిన కథ తో వస్తున్న ’99 సాంగ్స్’

99SongsMovieTrailerReleased From ARRahmanProduction

కోలీవుడ్: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ.ఆర్.రహమాన్ నిర్మాణంలో ’99 సాంగ్స్’ అనే ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కి ఏ.ఆర్.రహమాన్ కేవలం పొడక్షన్ మాత్రమే కాకుండా కథ కూడా అందించాడు అలాగే సంగీతం కూడా ఏ.ఆర్.రహమాన్ అందించాడు. ఈ సినిమా ట్రైలర్ ని ఈ రోజు ఏ.ఆర్.రహమాన్ విడుదల చేసారు.

ట్రైలర్ లో మ్యూజిక్ అంటే బాగా ఇష్టం ఉన్న ఒక కుర్రాడు చిన్న వయసులో మ్యూజిక్ వల్ల బాగా నష్టపోయామని మ్యూజిక్ మనకి వద్దు అని తండ్రి దగ్గర మాట ఇచ్చి సంగీతానికి దూరం అవుతాడు. పెద్దయ్యాక తన ప్రేయసి వలన సంగీతానికి దూరం అవుతాడు. కానీ చివరకి ఒక పాటతో ప్రపంచాన్ని మార్చవచ్చు అని మ్యూజిక్ సైడ్ తన ప్రయాణాన్ని మార్చుకుంటాడు. మరి సంగీతం లో తాను అనుకున్నది సాధిస్తాడా ,లేదా, ఆ ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అని సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

సినిమాకి దాదాపు ఐదు సంవత్సరాలనుండి ఏ.ఆర్.రహమాన్ కష్టపడుతున్నాడు. కథ కూడా మ్యూజికల్ బ్యాక్ డ్రాప్ లోనే అందించాడు. విశ్వేష్ కృష్ణమూర్తి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇహన్ భట్ అనే నూతన నటుడు హీరోగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాని ప్రస్తుతం తెలుగు ,తమిళ్ మరియు హిందీ లో ఏప్రిల్ 16 న విడుదల చేయనున్నారు.

99 Songs | Official Trailer (Telugu) | AR Rahman | Ehan Bhatt | Edilsy | Lisa Ray | Manisha Koirala

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular