టాలీవుడ్: కమర్షియల్ సినిమాలే కాకుండా చారిత్రాత్మక సినిమాలని తీస్తూ మంచి కంటెంట్ ని నమ్ముకుని ముందడుగు వేస్తున్న డైరెక్టర్లలో తెలుగులో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో గుణశేఖర్ పేరు వినిపిస్తుంది. రుద్రమదేవి సినిమా విజయవంతం అయిన తర్వాత రానా తో ‘హిరణ్య కశ్యప’ సినిమా కోసం చాలా రోజులు కష్టపడి దానికి ఇంకొంత సమయం తర్వాత అయితే ఆ సినిమా బిజినెస్ వర్కౌట్ అవుతుందని ఈ గ్యాప్ లో సమంత తో ‘శాకుంతలం’ అనే సినిమా ప్రకటించాడు గుణ శేఖర్. ఇది కూడా రెగ్యులర్ రొటీన్ సినిమా కాకుండా ‘శాకుంతలం’ అనే టైటిల్ తో ఒక చారిత్రాత్మక సబ్జెక్టు ని ఎంచుకున్నాడు.
ఈ సినిమాని కూడా ఎదో గ్యాప్ లో తీస్తున్నది అని కాకుండా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ సినిమాలో దుశ్యంతుడి పాత్రకి ఒక మలయాళ నటుడిని ఎంచుకున్నారు. పోయిన ఏడాది మలయాళంలో ‘సూఫీయుమ్ సుజాతయుమ్’ అనే సినిమాతో పరిచయం అయిన నటుడు ‘దేవ్ మోహన్’ ని ఈ సినిమాలో దుశ్యంతుడి పాత్రకి ఎంచుకున్నారు. వేరే బాష నుండి ఒక డెబ్యూ నటుడుని తీసుకోవడం కన్నా మన దగ్గరే ఆ పాత్రకి సరిపోయే నటులు చాలా మందే ఉన్నా కూడా ఈ మలయాళ నటుడిని ఎందుకు తీసుకున్నారో అనే విషయం లో క్లారిటీ లేదు. రుద్రమదేవి సినిమా విషయం లో ‘అల్లు అర్జున్’ పాత్రతో కొంచెం గట్టెక్కాడు కానీ ఈ సినిమాకి కూడా స్టార్ కాస్ట్ విషయంలో గుణశేఖర్ ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది.