టాలీవుడ్: ఓటీటీ లు కొన్ని సార్లు చిన్న సినిమాలకి వరంలా మారుతున్నాయి కొన్ని సినిమాలకి శాపంలా మారుతున్నాయి. ఒకప్పుడు అంటే అషన్స్ ఏమి లేకపోవడం వలన ప్రతి సినిమా థియేటర్లలోనే విడుదల చేసేవారు. ప్రస్తుతం కొన్ని చిన్న సినిమాలకి డిస్ట్రిబ్యూటర్స్ దొరకకపోవడం వల్లనేమో, లేదా థియేటర్లు దొరకక పోవడం వల్లనేమో లేదా మరేదైనా కారణం చేతనో కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. కానీ కొన్ని మంచి సినిమాలు థియేటర్లలో విడుదల అవకపోతే ఆ సినిమా రీచ్ కావాల్సినంత ఉండకపోవచ్చు. అలాంటి ఒక సినిమా ఇపుడు ఓటీటీ లో విడుదల అవుతుంది.
కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ ‘కార్తీక్ రత్నం‘ హీరోగా ‘అర్ద శతాబ్దం’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా కొంచెం ఐ ఓపెనర్ కాన్సెప్ట్, మనసుకి హత్తుకునే డైలాగ్స్ తో ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. కానీ అనుకోకుండా ఈ సినిమాని ‘ఆహ’ ఓటీటీ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రిషిత శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధా కృష్ణ ఈ సినిమాని నిర్మించారు. రవీంద్ర పుల్లే అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో మరిన్ని ముఖ్య పాత్రల్లో నవీన్ చంద్ర, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ , ఆమని, అజయ్, సుహాస్ నటించారు. మార్చ్ 26 నుండి ఈ సినిమా ఆహా ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది.