టాలీవుడ్: కరోనా వల్ల ఆలస్యం అయిన సినిమాలు మెల్ల మెల్లగా విడుదలకి సిద్ధం అవుతున్నాయి. ఈ వారం కూడా మూడు సినిమాలు విడుదలకి సిద్ధం అయ్యాయి. ఈరోజు శివరాత్రి కూడా అవడం తో వీకెండ్ అడ్వాంటేజ్ వస్తుండడం తో ఒక మూడు సినిమాలు మంచి హైప్ తో విడుదలకి సిద్ధం అయ్యాయి. మూడు సినిమాలు చిన్నవే అవడం, మంచి టాలెంట్ ఉన్న నటులు టెక్నిషియన్స్ నుండి ఈ సినిమాలు వస్తుండడం తో ఈ సినిమాల పైన మంచి బజ్ నెలకొంది.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా సక్సెస్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుండి ‘జాతి రత్నాలు’ అనే సినిమా రూపొంది ఈ రోజు విడుదల అవుతుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. నవీన్ తో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఈ సినిమాలో మరో రెండు ముఖ్య పాత్రల్లో నటిస్తుండడం తో ఈ సినిమా కామెడీ పైన అంచనాలు పెరిగాయి. ప్రమోషన్స్ కూడా చాలా కొత్తగా చేసిన ఈ సినిమా టీం విజయం పై కాన్ఫిడెంట్ గా వుంది.
వరుస ప్లాప్ లలో ఉన్న శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’ అనే సినిమా కూడా ఈరోజు విడుదల అవనుంది. ఇప్పుడున్న యూత్ కి వ్యవసాయం చెయ్యాలి అనే అవగాహనని కల్పించడం లాంటి అంశాన్ని ఒక ఎంటర్టైనింగ్ యాంగిల్ లో చెప్పడం అనే కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి, మంత్రి కేటీఆర్ బూస్టింగ్ ఇవ్వడం తో ఈ సినిమా పైన కూడా మంచి బజ్ నెలకొంది.
వైవిధ్య సినిమాలు చేస్తూ పోతున్న హీరో శ్రీ విష్ణు, మరియు కామెడీ ఎంటర్టైనర్ స్పెషలిస్ట్ రాజేంద్ర ప్రసాద్ తండ్రి కొడుకులుగా ‘గాలి సంపత్’ అనే టైటిల్ తో రూపొందిన సినిమా ఈరోజు విడుదల అవనుంది. మరో సక్సెస్ఫుల్ డైరెక్టర్ ‘అనిల్ రావిపూడి’ నిర్మాణ భాగస్వామ్యం మాత్రమే కాకుండా ఈ సినిమాకి కథ మరియు మాటలు అందించడంతో ఈ సినిమా పైన కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇవే కాకుండా కన్నడ టాప్ ఆక్టర్ దర్శన్ ‘రాబర్ట్’ అనే సినిమాతో తొలిసారి తెలుగు ఆడియన్స్ ని పలకరించనున్నాడు. ఈ సినిమా తెలుగు డబ్ వెర్షన్ ఈ రోజు విడుదలవుతుంది. ఇన్ని సినిమాలు విడుదలవుతున్నా కానీ దేనికదే కొత్తరకమైన కాన్సెప్ట్ తో వస్తుండడం తో అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నాం.