టాలీవుడ్: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఆదిపురుష్ అనే సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. మొత్తం హిందీ తారాగణంతో బాలీవుడ్ లోనే రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో రావణాసురుని పాత్రలో బాలీవుడ్ ఆక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ అనగా సీతాదేవి పాత్ర ఎవరు చేస్తున్నారు అనే విషయం సస్పెన్స్ లో ఉండేది. ఈ రోజు ఈ విషయాన్ని రివీల్ చేసింది సినిమా టీం.
తెలుగు లో మహేష్ బాబు హీరోగా రూపొందిన ‘1 -నేనొక్కడినే’ సినిమాతో తెలుగు వారికీ పరిచయం అయిన ‘కృతి సనన్’ ఆదిపురుష్ సినిమాలో సీతాదేవి కారెక్టర్ లో నటించబోతుంది. ఇందులో సీత దేవి కారెక్టర్ కి చాల పేర్లు వినిపించినప్పటికీ కృతి సనన్ ఫైనల్ అయింది. అంతే కాకుండా లక్ష్మణుని పాత్ర ‘సన్నీసింగ్’ అనే నటుడు చేయబోతున్నాడు. వీళ్ళిద్దరితో కలిసి ప్రభాస్ ఉన్న పిక్ ఒకటి విడుదల చేసి సీత మరియు లక్ష్మణులకి స్వాగతం అని ట్వీట్ చేసింది సినిమా టీం. ఈ సినిమాతో పటు కే.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఇదే కాకుండా రాధా కృష్ణ దర్శకత్వంలో పూర్తి లవ్ స్టోరీ గా రూపొందిన పీరియాడిక్ మూవీ ‘రాధే శ్యామ్’ కూడా జులై నెలలో విడుదలకి సిద్ధం అవుతుంది.