టాలీవుడ్: అక్కినేని నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, డిపార్ట్మెంట్ లో వైల్డ్ డాగ్ అని పిలవబడే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ విజయ్ వర్మ అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. దేశంలో నిజంగా జరిగిన ఒక బాంబు బ్లాస్ట్ జరిగిన తర్వాత దాని నేపధ్యానికి కొంచెం ఫిక్షన్ జోడించి ఈ సినిమాని రూపొందించారు. ట్రైలర్ లో చూపించిన యాక్షన్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. భాయ్, మన్మధుడు లాంటి ప్లాప్ సినిమాల తర్వాత నాగ్ కొంత గ్యాప్ తీసుకుని ఈ సినిమాని జాగ్రత్తగా ఎంచుకున్నాడు. గమనం లాంటి సినిమా తర్వాత మరొకసారి అలంటి పాత్రలో నటించబోతున్నాడు నాగార్జున. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా పైన అంచనాలు పెరుగుతున్నాయి.
ట్రైలర్ లో ఉగ్రవాదుల్ని వొదిలిపెట్టే ఆలోచనే లేని డైలాగ్స్, సీన్స్ లో నాగార్జున ఆకట్టుకున్నాడు. ‘ఒకడు మన దేశంలో వందల మందిని చంపి వెళ్తే మనం ఏమి చేయలేము అంటే నాకు ఓకే కాదు’ అనే డైలాగ్ తో ఈ సినిమాలో నాగార్జున పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పారు. ఈ సినిమా కోసం రిస్కీ లొకేషన్లో రిస్కీ షాట్స్ రూపొందించారు. సినిమాలో నాగార్జున కి జోడీగా బాలీవుడ్ నటి దియా మీర్జా నటిస్తుంది. మరిన్ని పాత్రల్లో సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. చిరంజీవి తో ఆచార్య సినిమాని రూపొందిస్తున్న మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 2 న థియేటర్లలో విడుదల అవనుంది.