టాలీవుడ్: టాలీవుడ్ లో సెన్సిబుల్ లవ్ స్టోరీస్ రూపొందించడంలో ఎక్స్పర్ట్ అయిన శేఖర్ కమ్ముల నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ అనే సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా నుండి ‘సారంగ దరియా’ అంటూ సాగే పాట విడుదలైంది. ఈ పాట కోసం సారంగ దరియా అని సాగే ఒక జాన పదాన్ని తీసుకొని దానికి సినిమాకి తగ్గట్టు సాహిత్యం అందించాడు సుద్దాల అశోక్ తేజ.
అయితే ఈ పాట మొదట వెలుగులోకి వచ్చింది తన వల్ల అని ఆ ఆపాట క్రెడిట్స్ తనకే చెందాలని కనీసం పాట అయినా తనతో పాడించి ఉండాల్సింది అని కోమలి మీడియా ముందుకు వచ్చింది.ఈ పాట హిట్ అవడం కన్నా ఈ పాటపై ఈ సింగర్ వల్ల వస్తున్న వివాదం రోజురోజుకి ముదురుతుండడం తో కొద్ది రోజుల క్రితం శేఖర్ కమ్ముల ఈ వివాదాన్ని ముగించేందుకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా సింగర్ కోమలి కి క్రెడిట్, డబ్బులు అలాగే ఆడియో ఫంక్షన్ లో పాడించే అవకాశం ఇస్తానని మాటిచ్చాడు.
అయినా కూడా మరొకసారి కోమలి వేరే స్టేజ్ పైన తనకి ఇలా జరిగింది అని వాపోవడంతో ఆ మరుసటి రోజే శేఖర్ కమ్ముల సింగర్ కోమలి తో ముఖా ముఖి అయ్యి కోమలి తో ఈ విషయం గురించి డిస్కస్ చేసి తాను సోషల్ మీడియా లో చెప్పినవే డైరెక్ట్ గా కోమలి తో మాట్లాడి ప్రెస్ మీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. సింగర్ కోమలి మాట్లాడుతూ శేఖర్ గారు తనని కలిసి తనకి హామీ ఇచ్చారు అని , ‘ఈ పాటని ఈ సినిమాలో వాడుకోవడం లో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని’ తెలిపారు. శేఖర్ కమ్ముల కూడా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వలన ఈ వివాదం పెరిగిందని ఇప్పటికైనా ఇది ముగించేద్దాం అని సెలవిచ్చారు.