టాలీవుడ్: ఒకప్పుడు సినిమాలు విడుదలైన సంవత్సరం రోజులకి ఎదో ఒక పండుగకు స్పెషల్ షోస్ పేరుతో రెండు గంటల సినిమాని అడ్వేర్టీసెమెంట్స్ తో కలిపి టెలివిజన్లలో నాలుగు గంటలు వేసే వారు. థియేటర్లలో చూడని జనాలు అలా నాలుగు గంటలు సినిమా చూస్తూ ఉండే వారు. కాలం మారే కొద్ది ప్రేక్షకులు, సినిమాలు చూస్తే ప్లేట్ ఫార్మ్స్ మారాయి. ఓటీటీ పేరుతో ఆన్లైన్ ప్లేట్ ఫార్మ్స్ వచ్చాయి. కరోనా, లాక్ డౌన్ వల్ల వీటికి ఆదరణ మరింతగా పెరిగింది. కేవలం విడుదలైన నెల రోజులకి, కొన్ని సినిమాలు ఐతే వారం రోజులకి కొన్ని సినిమాలు ఓటీటీ కోసమే ప్రత్యేకంగా రూపొందించబడుతున్నాయి. ఈ మధ్య విడుదలైన కొన్ని సినిమాలు ఈ వారం వచ్చే వారం లో ఓటీటీ లో విడుదల అవబోతున్నాయి.
ఫిబ్రవరి 5 న విడువులైన జాంబీ ల నేపథ్యం లో రూపొందిన కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జాంబీ రెడ్డి ఈ నెల 26 నుండి ఆహా ఓటీటీ లో స్ట్రీమ్ అవబోతుంది. మార్చ్ 11 న విడుదలైన గాలి సంపత్ మార్చ్ 19 నుండి ఆహా ఓటీటీ లో స్ట్రీమ్ అవబోతుంది. ఈ సంవత్సరం లో ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా మెగా మూవీ ఉప్పెన మార్చ్ 24 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన ఐతే లేదు. మార్చ్ 5 న విడుదలైన ‘A ad ఇన్ఫినిటీయం’ అనే థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఇంకో రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఇవే కాకుండా మార్చ్ 26 న ‘అర్ద శతాబ్దం’ అనే మూవీ డైరెక్టుగా ఆహా ఓటీటీ లో విడుదల అవనుంది.