fbpx
Monday, December 23, 2024
HomeAndhra Pradeshమళ్ళీ మొదలవబోతున్న జబర్దస్త్

మళ్ళీ మొదలవబోతున్న జబర్దస్త్

హైదరాబాద్: జబర్దస్త్ – తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రాం తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. గత 10 సంవత్సరాలుగా ఎన్ని విమర్శలొచ్చినా , ఎంత మంది కళాకారులు విడిచి వెళ్ళినా తిరిగి వచ్చినా ఆఖరికి నాగబాబు గారే వెళ్ళినా కూడా అవాంతరాలు లేకుండా విజయవంతంగా టీవీ ప్రేక్షకులని ఈ ప్రోగ్రాం అలరిస్తుంది. లాక్ డౌన్ వల్ల  సీరియల్స్ , రియాలిటీవై షోస్ షూటింగ్స్ నిలిపివేయడంతో పాత ప్రోగ్రామ్స్ రీ టెలికాస్ట్ చేశారు. ఇన్ని రోజులు ఆగిపోయిన ఈ ప్రోగ్రాం షూటింగ్ ఈ మధ్యనే పునః ప్రారంభం అయిందని త్వరలోనే టీవీ లో ప్రసారం ప్రారంభం అవుతుందని ఈ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ మల్లెమాల వాళ్ళు ప్రకటించారు

కొత్తగా గవర్నమెంట్ షూటింగ్స్ కి అనుమతి ఇవ్వడం తో వారం రోజుల క్రితమే సీరియల్స్ షూటింగ్స్ ప్రారంభం అయిన విషయం తెల్సిందే , మెల్లి మెల్లిగా కరోనా తో జీవించడం అలవాటు చేసుకునే క్రమంలో గవర్నమెంట్ ప్రకటించిన COVID నిబంధనలను పాటిస్తూ సీరియల్స్, రియాలిటీ షోస్ పునః ప్రారంభం ఐతున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular