ముంబాయి: 2020 లో భారతదేశం సినిమా అభిమానుల హృదయాల్ని బాగా కలచివేసిన విషయం యంగ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య. కారణం ఏదైనాగాని మంచి ఫామ్ & ఫేమ్ ఉండగానే ఇలాంటి ఊహించని పరిణామానికి చాలా మంది చలించారు. దీనిపైన బాలీవుడ్ వ్యాప్తంగా ముఖ్యంగా నేపోటిజం(వారసత్వం) పైన సోషల్ మిడిల్ లో చాల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ సుశాంత్ మరణం ఒక మిస్టరీనే. పోలీస్ డిపార్ట్మెంట్ ఆత్మహత్య అని తేల్చేసినా కూడా సుశాంత్ సన్నిహితులను, స్నేహితులను ఇంటరాగేషన్ నిర్వహిస్తుంది.
ఇదిలా ఉండగా ఫిలింమేకర్ విజయ్ గుప్తా సుశాంత్ సింగ్ పై సినిమా ప్రకటించారు. వి.ఎస్.జి బింగే బ్యానర్ పైన విజయ్ శేఖర్ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షామిక్ మౌలిక్ దర్శకత్వం వహించనున్నారు. సుశాంత్ జీవితం మరియు మరణం అలాగే మరణానికి సంబంధించిన విషయాల ఆధారంగా ‘సూసైడ్ ఆర్ మర్డర్ ‘ అనే టైటిల్ తో ఇంస్టాగ్రామ్ ద్వారా అధికార ప్రకటన చేశారు. దీనికి టాగ్ లైన్ గా ‘ఆ స్టార్ వాస్ లాస్ట్’ అని పెట్టారు. దీంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఈ సినిమా అనౌన్స్ చేసిన వెంటనే కొందరు సపోర్ట్ చేస్తుండగా కొందరు అపుడేనా కనీసం పోలీసు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నిజాలు తెల్సిన తర్వాత తియ్యండి అని సలహాలు , విమర్శలు చేస్తున్నారు.అలాగే సుశాంత్ మరణం తర్వాత చాలా మంది సినిమా అవకాశాల కోసం వచ్చే వారి కష్టాల పైన ఓపెన్ గా కొన్ని కొత్త విషయాలు చెప్తున్నారు. స్టార్స్ కూడా వాళ్ళు ఎదిగే క్రమం లో వాళ్ళు పడ్డ కష్టాలు, బాధించిన అనుమానాలు గురించి సోషల్ మీడియా లో చెప్పుకొచ్చారు.