ముంబై: దేశంలో హోలీ పండుగ వేళ ఆపిల్ కంపెనీ తమ ఐఫోన్ల ధరలో తగ్గింపు ఇవ్వనుంది. కొద్ది రోజులు మాత్రమే ఉండే ఈ ఆఫర్ కింద ఐఫోన్ 11 మోడల్ పై 13వేల రూపాయలు తగ్గించి 41,900 రూపాయలకే అందివ్వనుంది. ఆపిల్ ప్రీమియం రీ సెల్లర్ ఇమేజిన్‌లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలో ఐఫోన్ 11 ను కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్ లభిస్తుంది.
కాగా 13వేల రూపాయల హోలీ ఆఫర్లో రూ. 5,000 క్యాష్ బ్యాక్‌తోపాటు, ఇతర యాక్ససరీస్‌పై రూ. 8వేలను తగ్గింపును కంపెని ఆఫర్ ఇస్తోంది. ఇంకా దీనితో పాటు అదనంగా ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ కింద రూ. 3 వేల తగ్గింపు కూడా పొందవచ్చు. ఐఫోన్ 11 తో పాటు ఐఫోన్ 12 మరియు మినీ ఐఫోన్ 12 లపై డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఆఫర్ ఎంతకాలం ఉంటుందో అనే విషయం పైన ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
హెచ్డీఎఫ్సి బ్యాంక్ క్యాష్‌బ్యాక్ మాత్రం కేవలం మార్చి 27 వరకు అందుబాటులో ఉండనున్నట్టు సమాచారం. 2019, సెప్టెంబర్ లో లాంచ్ అయిన ఐఫోన్ 11 ధర ప్రస్తుతం రూ.54,900 గా ఉంది. దేశీయంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మోడళ్లలో ఈ ఫోన్ ఒకటి. మార్కెటింగ్ పరిశోధన సంస్థ ఓమ్డియా 2020 లో అత్యధికంగా రవాణా చేయబడిన స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 11 అని ఇటీవల పేర్కొంది.
ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్: 64జీబీ, 128, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌లో బ్లాక్, గ్రీన్, (ప్రొడక్ట్) రెడ్, పర్పుల్, ఎల్లో వైట్ అనే ఆరు విభిన్న రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.