గణపవరం: సర్కిల్ ఇన్స్పెక్టర్ డేగల భగవాన్ ప్రసాద్(42) గణపవరంలో గుండెపోటుతో మరణించారు. 23 మార్చి మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో భగవాన్ ప్రసాద్ తన స్నేహితులతో పాటు షటిల్ ఆడుతున్నాడు. ఇంతలో ఆట మధ్యలో ఆయన ఒక్కసారిగా గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
కాగా ఆ ప్రాంతంలోనే ఉన్న ఎమ్మెల్యే వాసుబాబు సోదరుడు కార్తీక్ వెంటనే సీఐను అంబులెన్స్‌లో గణపవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి పీహెచ్‌సీకి తరలించగా తనని పరీక్షించిన వైద్యులు అప్పటికే సీఇ మరణించినట్లు తెలిపారు.
భగవాన్ ప్రసాద్ కు భార్య, ఒక కుమారుడు మరియు కుమార్తె ఉన్నారు. తూర్పుగోదావరి కరప మండలం పెద్దాపురప్పాడు గ్రామానికి చెందిన భగవాన్‌ప్రసాద్ 2003లో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరి, 2007లో ఆర్ఎస్ఐగా, 2009లో సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. నాలుగేళ్ల క్రితమే ఆయన సీఐగా ప్రమోషన్ పొందారు. సీఐ మృతదేహాన్ని ఎమ్మెల్యే వాసుబాబు సందర్శించి నివాళులర్పించారు.