వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ అయిన జెరోమ్ పోవెల్ బిట్ కాయిన్‌కు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు ఈ రోజు చేసారు. ప్రపంచ సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికీ డిజిటల్ కరెన్సీ అయిన క్రిప్టోకరెన్సీ వంటి వాటి సామర్థ్యాన్ని అన్వేషిస్తూనే ఉంది. ప్రజలు కూడా బిట్ కాయిన్ రిస్క్‌ను అర్థం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు డాలర్ లేదా బంగారానికి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేవని ఆయన అన్నారు. గత కొంత కాలంగా బిట్ కాయిన్ విలువ భారీగా పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. టెస్లా కంపెనీ తన కార్ల అమ్మకానికి బిట్ కాయిన్ రూపంలో పే చేసి కొనుగోలు చేయొచ్చని అధికారికంగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే బిట్ కాయిన్ 60వేల డాలర్లను కూడా దాటి తన జీవిత కాల గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం 58వేల డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. కరోనా కాలంలో కూడా ఇది రాకెట్ కంటే వేగంతో దూసుకెళ్తూ పెట్టుబడిదారులను ఆకట్టుకున్న క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ పైన అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పోవేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిట్ కాయిన్ ఇంకా మార్కెట్లో ఉన్న ఇతర క్రిప్టో కరెన్సీలు డాలర్ వంటి ప్రధాన కరెన్సీకి ఎప్పటికీ ప్రత్యామ్నాయంగా పరిగణించలేమని ఆయన అన్నారు. వాటి విలువ ఎల్లపుడు అస్థిరతతో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ప్రధాన కరెన్సీకి ప్రభుత్వం మద్దతు ఉందని అయితే, క్రిప్టో కరెన్సీ విలువను నిర్దారించే అసెట్స్ ఏవీ లేవని గుర్తు చేశారు. ఇటీవల టెస్లా, స్క్వేర్ ఇన్వెస్ట్ వంటి దిగ్గజ కంపెనీలు బిట్ కాయిన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో జంప్ చేస్తోంది.