టాలీవుడ్: తెలుగు లో టాలెంటెడ్ యాక్టర్ మరియు డైరెక్టర్, స్టోరీ రైటర్ గా మంచి పేరున్న అవసరాల శ్రీనివాస్ హీరోగా ‘101 జిల్లాల అందగాడు’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో శ్రీని ఒక బట్టతల ఉన్న వ్యక్తి గా నటించబోతున్నాడు. బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొంది సూపర్ హిట్ అయినా ‘బాలా’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది ఇండస్ట్రీ లో ఒక టాక్ ఉంది కానీ ఈ సినిమాకి రైటర్ గా అవసరాల శ్రీనివాస్ పేరుండడం తో ఇది రీమేక్ కాదేమో అనిపిస్తుంది. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది సినిమా టీం. గొట్టి సూర్యనారాయణ అనే పాత్రలో నటించబోతున్న అవసరాల శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.
నిన్న ఈ సినిమాకి సంబందించిన ఒక ప్రాంక్ వీడియో విడుదల చేసింది సినిమా టీం. అవసరాల శ్రీనివాస్ నిజ రూపం అంటూ ఒక ప్రాంక్ వీడియో రిలీజ్ చేసి ప్రొమోషన్ మొదలు పెట్టేసింది సినిమా టీం. మరి కొన్ని రోజుల్లో సినిమా టీజర్ విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు మూవీ మేకర్స్. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు మరియు క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి , సాయి బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాచకొండ విద్యాసాగర్ అనే దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిదా లాంటి సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన శక్తి కాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.