హైదరాబాద్: సోషల్ మీడియా వచ్చినా తర్వాత కొన్ని విషయాలు డైరెక్ట్ గా వ్యక్తపరిచే విషయం లో సెలబ్రిటీలు కొంతవరకు ఆనందం వ్యక్తం చేస్టున్నారు, దీని వల్ల కొన్ని రూమర్స్ కి చెక్ పెట్టినట్లు అవుతుందని వాళ్ళ విశ్వాసం. అప్పుడపుడు వాల్ల సొంత విషయాలు వాల్లు చేసే సినిమా విషయాలు కాకుండా ఫాలోయర్స్ అడిగే ప్రశ్నలకి కూడా సమాధానాలు పోస్ట్ చేస్తుంటారు.
ఫైటర్ సినిమా విషయంగా స్క్రిప్ట్ చేంజ్ రూమర్స్ పై ఒక ఫ్యాన్ ప్రశ్నించగా అలాంటిది ఏమి లేదని ఫైటర్ స్క్రిప్ట్ పైన చాలా నమ్మకం గా ఉన్నామని ఆ సినిమా బ్లాక్బస్టర్ అవుతుందని ఛార్మి చెప్పుకొచ్చింది. కరోనా వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్స్ చేసేందుకు వీలు లేకపోవడం తో ఫైటర్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చామని ఈ క్రైసిస్ అవగానే శరవేగంగా షూటింగ్ స్టార్ట్ చేస్తామని , ఈ సినిమా ఒరిజినల్ టైటిల్ కూడా త్వరలో రెవీల్ చేస్తామని సినిమాకి ఒక ప్రొడ్యూసర్ అయిన ఛార్మి చెప్పుకొచ్చింది.
సినిమాలు చాలా ఫాస్ట్ గా తియ్యడం లో టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ కి మంచి పేరుంది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్బస్టర్ తీసి మంచి ఫార్మ్ లో ఉన్నా పూరి మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ తో జోడీ కట్టి ఫైటర్ (వర్కింగ్ టైటిల్) ని సిద్ధం చేస్తున్నారు. కరోనా క్రైసిస్ లేకుంటే ఇప్పటికి సినిమా పూర్తిగా సిద్ధంగా ఉండేది.