విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల విషయంలో ఎప్పుడూ ఏవో ఒక సంచలనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మాజీ సీఎస్ నీలం సాహ్ని నియమించడం జరిగింది.
రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నీలం సాహ్ని పేరును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బీబీ హరిచందన్ ఇవాళ ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం నీలం సాహ్నీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ముఖ్య సలహాదారుగా పని చేస్తున్నారు.
ఏపీ రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి ఇది వరకే పంపించింది. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ యొక్క పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది.