అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో కేసులు అన్ని రాష్ట్రాల కంటే అధికంగా నమోదవుతున్నాయి. దక్షిణాది అయిన ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 42,696 కరోనా పరీక్షలు నిర్వహించగా, 947 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 8,97,810 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారింప బడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 377 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,85,892 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇక తాజాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా వల్ల ఎటువంటి మరణం సంభవించలేదు. ఇప్పటివరకు కరోనా వైరస్ వల్ల 7,203 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 4,715 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో 1,49,58,897 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.