టాలీవుడ్: అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ఫ్రెండ్ కారెక్టర్ లో నటించి మెప్పించి ఒక్క సినిమాతోనే మంచి స్టార్డం తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. ఈ మధ్యనే జాతి రత్నాలు సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన రాహుల్ ముఖ్య పాత్రలో రూపొందిన ‘Y ‘ అనే సినిమా ఓటీటీ లో విడులవబోతుంది. తక్కువ బడ్జెట్ లో ఓటీటీ కోసమే కొన్ని సినిమాలు రూపొందించి విడుదల చేస్తుంది ఆహా టీం. ఇదివరకే రూపొందించిన భానుమతి రామకృష్ణ, కంబాలపల్లి కథలు, సూపర్ ఓవర్ లాంటి ఓటీటీ సినిమాలు మంచి వ్యూస్ సంపాదించాయి. ప్రస్తుతం రాహుల్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘వై’ సినిమా కూడా ఏప్రిల్ 2 నుండి ఆహా ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది.
స్నేహితుడు, ఒకరికి ఒకరు, నిప్పు , లై లాంటి సినిమాల్లో నటించి తెలుగులో కూడా కొంచెం గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీరామ్ (శ్రీకాంత్) ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. టీజర్ లో చూపించిన దాని ప్రకారం శ్రీరామ్ ని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు అర్ధం అవుతుంది. మిగతా స్టార్ కాస్ట్ ఏమీ లేని ఈ సినిమాని కేవలం రాహుల్ రామకృష్ణ ఫేమ్ పైన్నే ప్రచారం చేస్తుంది సినిమా టీం. ఏరుకొండ రఘురాం, శ్రీనివాస్ వేగి , మురళి మాతురు నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. అడుసుమల్లి బాలు అనే దర్శకుడు ఈ సినిమాని రూపొందించాడు.