అమరావతి : ఉత్తరాది లో ఘనీయంగా పెరుగుతున్న కరోనా కేసులు దక్షిణాది లో కూడా నిదానంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక లో కేసులు పెరుగుదల బాగా కనిపిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా గత 24 గంటల్లో 30,964 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,184 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
దీంతో ఇప్పటికి రాష్ట్రంలో 901989 మంది కరోనా వైరస్ బారిన పడినట్లైంది. అలాగే గత 24 గంటల్లో ఆసుపత్రీ నుండి 456 మంది కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవగా, ఇప్పటివరకు 8,87,434 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం తన హెల్త్ బులెటిన్ లో తెలియ జేసింది.
గడచిన 24 గంటల్లో కరోనా వైరస్ సోకిన వారిలో మొత్తం నలుగురు మృతి చెందగా, ఇప్పటివరకు 7217 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7338 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,50,83,179 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.