టాలీవుడ్: ఎస్.ఎస్. రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా RRR . ఈ సినిమా నుండి విడుదలయ్యే ప్రతి పోస్టర్, టీజర్, మోషన్ పోస్టర్ ఈ సినిమా రేంజ్ ని పెంచుతున్నాయి. అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు చాలా ఉన్నాయి. రాజమౌళి కూడా అంచనాలకి ఎక్కడా తగ్గకుండా చూసుకుంటున్నాడు. ఈ సినిమాని వేరే భాషల్లో ప్రమోట్ చేయడానికి వివిధ బాషల నటుల్ని ఎంచుకున్నాడు రాజమౌళి. హిందీ నుండి అలియా భట్ మరియు అజయ్ దేవగన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ రోజు అజయ్ దేవగన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో అజయ్ దేవగన్ కి సంబందించిన పాత్ర మోషన్ పోస్టర్ విడుదల చేసింది సినిమా టీం. వీడియో లో అజయ్ దేవగన్ ని బ్యాక్ నుండి చూపిస్తూ లోడ్, ఎయిమ్, షూట్ అని చెప్తూ శత్రువుల తూటాలకు ఛాతి ఎత్తి ఎదురుతిరిగే పాత్రలో అజయ్ దేవగన్ పాత్ర మోషన్ పోస్టర్ ద్వారా విడుదల చేసింది సినిమా టీం.
ఈ సినిమాని స్వాతంత్య్రం రాకముందు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం లని ఉద్దేశించి ఒక ఫిక్షన్ కథని ప్రిపేర్ చేసి రూపొందిస్తున్నాడు రాజమౌళి. అజయ్ దేవగన్ వీళ్లిద్దరికీ శిక్షణనిచ్చే పాత్రలో నటిస్తున్నాడు. ‘తన చుట్టూ ఉండే వాళ్ళని శక్తివంతం చేయడం అతని బలం, అతని లక్షణం’ అని ట్వీట్ చేస్తూ అజయ్ దేవగన్ ని ప్రెసెంట్ చేసింది సినిమా టీం. ఆక్టోబర్ 13 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవనుంది.