హైదరాబాద్: వివాదాలు తన చుట్టూ తిరుగుతాయో తానే వివాదాల చుట్టూ తిరుగుతాడో తెలియదు కానీ రామ్ గోపాల్ వర్మ బర్నింగ్ ఇష్యూస్ పైన సినిమాల మీద సినిమాలు ప్రకటిస్తున్నారు. అందులో కొన్ని సినిమాలు పూర్తి చేసినా కొన్ని ప్రకటన వరకే ఆగిపోతున్నాయి. ఈరోజు ఫాథర్స్ డే ని పురస్కరించుకొని మరొక కొత్త సినిమా ప్రకటించారు.
తెలుగు రాష్టాల్లో సంవత్సరం క్రితం బాగా చర్చనీయాంశం ఐన ప్రణయ్ మర్డర్ కేసు కి కేంద్ర బిందువైన మారుతి రావు మరియు అతని కూతురు అమృత ల కథ పైన కొత్త సినిమా ప్రకటించారు. సినిమా ప్రకటించడం తో పాటు మారుతి రావు మరియు అమృత ల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇది కూతుర్ని అధికంగా ప్రేమించే భయంకరమైన తండ్రి ప్రేమ అని హ్యాపీ ఫాథర్స్ డే ని విషెస్ చెప్తూ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమా పేరు మర్డర్ , ‘కుటుంబ కథా చిత్రం ‘ అనే టాగ్ కూడా జోడించారు.
ఈ సినిమాలో మారుతి రావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు. ఈయన రామ్ గోపాల్ వర్మ తీస్తున్న కరోనా సినిమాలో కూడా నటిస్తున్నారు. చూస్తుంటే వర్మ తన దగ్గరికి వచ్చిన ప్రతి వివాస్పదమైన అంశం చుట్టూ సినిమా తీసేలా ఉన్నారు. అలాగే కూతురు అమృత పాత్ర లో అవంఛ సాహితి అనే కొత్త అమ్మాయి నటిస్తున్నారు.