fbpx
Wednesday, December 25, 2024
HomeMovie Newsఆసక్తి రేకెత్తిస్తున్న 'చతుర్ముఖం'

ఆసక్తి రేకెత్తిస్తున్న ‘చతుర్ముఖం’

ManjuWarrior ChaturMukham TrailerRelease

మాలీవుడ్: కొత్తరకమైన ప్రయోగాలని చేయడం, స్టార్ డం కి అతీతంగా సినిమాలు తీసి విజయాలు సాధించడంలో మలయాళం సినిమా ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య మలయాళం ఇండస్ట్రీ లో విడుదలయ్యే సినిమాల కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ఇప్పుడు ఉన్న సినీ ఇండస్ట్రీలో ఎక్కువ ప్రయోగాలు, కొత్త కథలతో వచ్చే సినిమాలు కూడా ఈ ఇండస్ట్రీ నుండే. ప్రస్తుతం మలయాళం లో రూపొందుతున్న ‘చతుర్ముఖం’ అనే సినిమా ఆసక్తి క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ఈ కథ మరో లెవెల్ లో ఉండొచ్చేమో అని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ఈ సినిమాతో మన దగ్గర మొదటి సారి టెక్నో-హారర్ జానర్ ని టచ్ చేయబోతున్నారు. ఒక మంచి ఆధునిక స్వభావాలు ఉన్న అమ్మయి, ప్రతి విషయం సోషల్ మీడియా లో షేర్ చేసుకునే అమ్మాయి అనుకోకుండా ఈ టెక్నాలజీ వల్ల ఇబ్బందులు పడే సన్నివేశాలు ట్రైలర్ లో కనిపించాయి. తనకి తెలియకుండా తన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ తనవల్లనే జరుగుతున్నాయి అని తెలియకుండా ఇబ్బందులు పడే కారెక్టర్ లో మంజు వారియర్ ఈ సినిమాలో నటిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం సెన్సేషన్ అయిన ‘బ్లూ-వేల్’ గేమ్ ఈ కథకి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ లో చూపించిన సీన్స్ అన్ని ఆకట్టుకుని ఈ సినిమా పై అంచనాలు, ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

జిస్ టామ్స్ మూవీస్, మంజు వారియర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జిస్ టామ్స్ మరియు జస్టిన్ థామస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రంజిత్ కమల శంకర్ మరియు సలీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. న్యూ ఏజ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 8 న విడుదలవబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular