ముంబై: 14వ సీజన్ ఐపీఎల్ లో కొత్త కెప్టెన్సీల హవా ఎక్కువగా కనిపిస్తోంది. మొన్న ఢిల్లీ కెప్టెన్ గా రిషబ్ పంత్ సెలెక్ట్ అవగా, తాజాగా రాజస్థాన్ రాయల్స్ నూతన కెప్టెన్‌గా సంజు శాంసన్ ఎంపికయ్యాడు. కాగా గతేడాది ఐపీఎల్ సీజన్‌లో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో రాజస్తాన్ రాయల్స్ 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది.
ఇప్పుడు కొత్త కెప్టెన్ శాంసన్ తన కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న సందర్భంలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మరియు ఎంఎస్ ధోని నుంచి తనకు మెసేజ్‌లు వచ్చాయంటూ తెలిపాడు. ”కంగ్రాట్స్ శాంసన్.. కొత్త బాధ్యతతో ఐపీఎల్‌లో బరిలోకి దిగుతున్నావు.. ఆల్ ది బెస్ట్ అంటూ ముగ్గురు అభినందిస్తూ పర్సనల్‌గా సందేశాలు పంపారని” తెలిపాడు.
రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కి 2013 నుంచి ఆడుతూ ఉన్న సంజు శాంసన్.. ఆ జట్టుపై 2016-17లో నిషేధం పడటంతో, ఆ రెండు సీజన్లు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా, రాజస్థాన్ రాయల్స్ టీమ్ తన ఫస్ట్ మ్యాచ్‌ని పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 12న ముంబైలో ఆడనుంది.