న్యూఢిల్లీ: మన దేశంలో ఇప్పటికే కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో ప్రజల్లో దడ పుత్తిస్తోంది. దీనివల్ల అకస్మాత్తుగా పాజిటివ్ కేసులు పెరగడం వల్ల చాలా రాష్ట్రాలు దాదాపుగా లాక్‌డౌన్ వంటి చర్యలకు ఉపక్రమించాయి.
ఈ సందర్భంలో కరోనాకు సంబంధించి ప్రజలలో భయాందోళనలను సృష్టించే లక్ష్యంతో వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చాలా నకిలీ సందేశాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటిదే ఒకటి కరోనా వైరస్ వల్ల దేశంలో ఏప్రిల్ 15 నాటికి 50,000 మందికి పైగా చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసిందని పేర్కొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా కరోనా రెండో వేవ్ వల్ల భారత దేశంలో ఏప్రిల్ 15 లోపు 50000 మంది ప్రజలు మరణిస్తారని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని డబ్యూహెచ్‌వో ఇవాళ స్పష్టం చేసింది. అలాంటి హెచ్చరికలు ఏవీ తాము జారీ చేయలేదని స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌వో పేరిట వైర్‌ల్ అవుతున్న ఓ వీడియో ఫేక్ న్యూస్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయం తన అధికారక ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసింది.