అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలంటేనే ఎదో ఒక అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి. నిమ్మగడ్డ రమేష్ ఉన్నప్పుడే అనుకుంటే ఇప్పుదు కొత్త ఎలక్షన్ కమీషనర్ వచ్చినా కూడా అదే పరిస్థితి నెలకొంది.
తాజాగా ఏపీలో ఏప్రిల్ 8న పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించింది. దీని వల్ల ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా వేసినట్లయింది. హై కోర్టు పరిషత్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపింది.
ఈ నేపథ్యంలోనే హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై నాలుగు వారాల కోడ్ అమలు చేయలేదన్న హైకోర్టు తెలిపింది. దీనిపై ఈనెల 15వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు కూడా జారీ చేసింది.
అలా అని ఈ ఎన్నికలకు మరో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో ఎల్లుండి జరగాల్సిన ఎన్నికలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి.