అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలకు ఏపీ హై కోర్టు డివిజన్ బెంచ్ పచ్చ జెండా ఊపింది. నిన్న ఎన్నికలపై స్టే విధిస్తూ, హై కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని ఇవాళ డివిజన్ బెంచ్ కొట్టీ వేసింది. రేపు యథావిధిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.
కాబట్టి ఈ తీర్పు నేపథ్యంలో రేపే అనగా 8వ తేదీన పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. కాగా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మాత్రంకౌంటింగ్ నిలిపివేయాల్సిందిగా హై కోర్టూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
పరిషత్ ఎన్నికల పై ఇచ్చిన స్టే ని సవాలు చేసిన ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరం వాదనలు వినిపించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఏజీ కోర్టును కోరారు. ఎస్‌ఈసీ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ సీవీ మోహన్ రెడ్డి, పిటిషన్ వేసిన వర్ల రామయ్యకు ఎన్నికలతో సబంధం లేదని తెలిపారు.
అలాగే ఎన్నికలకు 28 రోజుల కోడ్ నిబంధన వర్తింపజేయనవసరం లేదని సీవీ మోహన్ రెడ్డి హై కోర్టు డివిజన్ బెంచ్‌కు తెలిపారు. ఇరు పక్షాల వాదలను విన్న బెంచ్ పరిషత్ ఎన్నికలు యథావిధిగా జరగడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.