టాలీవుడ్: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమాని అలాగే అల్లు అర్జున్ ని పాన్ ఇండియా లెవెల్ లో నిలబెట్టేందుకు అల్లు అండ్ టీం చాలా గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఆగష్టు లో విడుదలకి సిద్దమవుతున్న ఈ సినిమాకి ఇప్పటినుండే ప్రొమోషన్ మొదలు పెట్టారు. టీజర్ రిలీజ్ కి ఫస్ట్ మీట్ అని ఒక ఈవెంట్ జరిపి టీజర్ విడుదల చేసారు.
సుకుమార్ అంటేనే సినిమాలో టెక్నికల్ అంశాలకి, కథకి, కథనానికి లోటు ఉండదు. ఆ విషయాన్ని పుష్ప సినిమాతో మరోసారి రుజువు చేయబోతున్నాడు సుకుమార్. అడవుల్లో ఎర్ర చందనం స్మగ్గ్లింగ్ మరియు లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఒక నిమిషానికి పైగా ఉన్న టీజర్ లో యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఇంకా విజువల్స్ ఐతే అదిరిపోయాయి అని చెప్పుకోవచ్చు. అడవుల్లో చేజ్ సీన్స్, గంధపు చెక్కలని ఒకే సారి కింద పడేసే సీన్స్ లో సినిమాటోగ్రఫీ బ్రిలియన్స్ కనిపిస్తుంది. ఇంకా సుకుమార్ అంటే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎలా ఇస్తాడో టీజర్ లో వినిపించిన మ్యూజిక్ తో మరో సారి ప్రూవ్ చేసాడు.
మైత్రి మూవీ మేకర్స్ కూడా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాని రూపొందించినట్టు కనిపిస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ యాక్షన్ చూపించబోతున్నాడు. లారీ డ్రైవర్ గా, కత్తి పట్టుకుని నరికే పాత్రలో, కళ్ళకి గంతలు కట్టుకుని చేసే ఫైట్స్ లో యాక్షన్ విషయంలో తగ్గేదే లే అన్నట్టు ప్రెసెంట్ చేసాడు. అంతే కాకుండా ఈ సినిమాతో బన్నీ ని ‘ఐకాన్ స్టార్’ గా ప్రెసెంట్ చేస్తున్నారు. ఆగష్టు లోఈ సినిమాని తెలుగు, హిందీ. తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు.