టాలీవుడ్: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ టాప్ హీరో గా ఉండగానే సినిమాల్ని వదిలి రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ కం బ్యాక్ అయ్యి వరుసగా మూవీస్ చేస్తున్నాడు. ఈ రోజు పవన్ నటించిన సినిమా మూడు సంవత్సరాల తర్వాత విడుదలయింది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ ‘వకీల్ సాబ్’ టాక్ చూద్దాం.
ఈ సినిమా కథ విషయానికి వస్తే హిందీ లో రూపొందిన పింక్ సినిమా రీమేక్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుత సమాజంలో అమ్మాయిలని కొన్ని పరిస్థితుల్లో ఎలా చూస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే బ్యాక్ డ్రాప్ లో రూపొందించబడింది. ఈ రీమేక్ లో ఒరిజినల్ ఎస్సెన్స్ ని అలాగే ఉంచి పేదవాడికి న్యాయం మాత్రం దొరకట్లేదు అనే కాన్సెప్ట్ ని జోడించి పవన్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ఫైట్స్, మరి కొంత స్టోరీ ఆడ్ చేసి ఈ సినిమా రూపొందించారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా మెయిన్ కంటెంట్ ని చెడగొట్టకుండా కమర్షియల్ హీరోని నటింపచేసి కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ క్రియేట్ చేయగలగడం లో సక్సెస్ అయ్యారు రైటర్స్.
సినిమా ఆరంభంలో సిటీ లో ఉంటూ ఇంటి బాధ్యతల్ని పంచుకునే ముగ్గురు రూమ్ మేట్స్ గా అంజలి, నివేత థామస్, అనన్య పరిచయం అవుతారు. వాళ్ళు అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కుంటారు. ఆ సమస్య ఒక మంత్రి కొడుకు వల్ల ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఆ మంత్రి కొడుకు ఈగో కి పోయి ఈ ముగ్గురు అమ్మాయిలని ఇంకా ఇబ్బంది పెడుతుంటాడు. తనకి ఉన్న పవర్ ని అడ్డం పెట్టుకుని వీళ్ళ పై కేసులు పెడ్తాడు. ఆ తర్వాత ఈ అమ్మాయిలకి పవన్ కళ్యాణ్ పరిచయం ఎలా జరిగింది, పవన్ ఒరిజినల్ కథ ఏంటి, వీళ్ళ సమస్యని పవన్ కళ్యాణ్ ఎలా సాల్వ్ చేసాడు అనేది మిగతా కథ, కథనం.
ఈ సినిమా కథలోని మెయిన్ ఎస్సెన్స్ డిస్టర్బ్ చేయకుండా పవన్ ఇమేజ్ కోసం మార్చిన ఎలెమెంట్స్ అక్కట్టుకునేలా రూపొందించిన డైరెక్టర్ మరియు రైటర్స్ టీం ని అభినందించకుండా ఉండలేం. సినిమాలో వచ్చే ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఉండే లవ్ స్టోరీ తప్ప డైరెక్టర్ ని, రైటర్స్ ని వేలెత్తి చూపే అవకాశం లేదు. అంతే కాకుండా ఈ సినిమాలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ రాసిన డైలాగ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. కొన్ని డైలాగ్స్ పవన్ రాజకీయ పరిస్థితులని కూడా చెప్పే విధంగా ఉంది తన ఆలోచన ఏంటి అనేది కూడా ప్రెసెంట్ చేసినట్టు అనిపిస్తుంది. చాలా డైలాగ్స్ పవన్ రియల్ లైఫ్ సిచువేషన్స్ నుండి రాసుకున్నట్టు అనిపిస్తాయి. మరో టెక్నిషియన్ గురించి చెప్పకుండా ఈ సినిమా టాక్ కూడా ముగించలేం, అదే మ్యూజిక్ డైరెక్టర్ థమన్. సినిమా స్టార్టింగ్ లో దిల్ రాజు బ్యానర్ మ్యూజిక్ తర్వాత నుండి థమన్ అదరగొట్టే మ్యూజిక్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. సినిమాలో వచ్చే పాటలు కూడా ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. ఈ సినిమాకి వీళ్ళకి అంతగా స్కోప్ లేకపోయినా వాళ్ళ పరిధుల్లో ఆకట్టుకున్నారు.
నటీ నటుల విషయానికి వస్తే న్యాయం కోసం పరితపించే పాత్రలో కోర్ట్ సీన్లలో నివేత థామస్ నటన ఆకట్టుకుంటుంది. అంజలి తన పాత్ర వారికి బాగానే నటించింది. ఒక పల్లెటూరి నుండి వచ్చి సిటీ లో ఉండే పాత్రలో చేసిన అనన్య తన అమాయకత్వం నటనతో ఆకట్టుకుంది. లాయర్ గా పవన్ కళ్యాణ్ తో వాదించే నంద పాత్రలో ప్రకాష్ రాజ్ తన పాత్రని చాలా సులువుగా చేసుకుంటూ వెళ్ళాడు. మిగతా పాత్రలు తమ పరిధి వరకు చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ పాత్ర. సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ ది వన్ మాన్ షో అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఒక పాత్ర, నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇస్తే పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో నటన చూపించగలడో ఈ సినిమా ఒక నిదర్శనం. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాలు ఇంత కలెక్ట్ చేసాయి, ఫాన్స్ ని ఎక్సయిట్ చేశాయి అని చెప్పుకుంటాం కానీ ఈ సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ ని మెచ్చుకోకుండా ఉండలేం. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కం బ్యాక్ కోసం కరెక్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు.
ఓవరాల్ గా చెప్పాలంటే
- ఇది వకీల్ సాబ్ కాదు వసూల్ సాబ్
- It’s no more a come back movie.. He already came BACK WITH A BAAANG